Japali Theertham: తిరుమల జపాలి తీర్థంలో అపశ్రుతి... వీడియో ఇదిగో!

Tragic incident took place in Tirumala Japali Tirth
తిరుమల క్షేత్రంలోని జపాలి తీర్థంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ భక్తురాలిపై చెట్టు కొమ్మ విరిగిపడడంతో ఆమె కుప్పకూలింది. బెంగళూరుకు చెందిన ఉమారాణి అనే భక్తురాలు తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి జపాలి తీర్థంలోని ఆంజనేయస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆమె ఆలయంలోకి వెళుతుండగా, ఓ చెట్టు కొమ్మ ఉన్నట్టుండి విరిగి ఆమెపై పడింది. దాంతో ఉమారాణి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకు తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి బర్డ్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు నడుం విరిగినట్టుగా భావిస్తున్నారు.
Japali Theertham
Umarani
Tree Branch
Tirumala
Bengaluru

More Telugu News