Mariamma: పవన్ గెలిచారు.. మరియమ్మకు ఆటో ఇచ్చి మాట నిలబెట్టుకున్న నిర్మాత.. వీడియో ఇదిగో!

Baby Movie Producer SKN Gifted Auto To Pithapuram Mariamma
  • ఎన్నికల సమయంలో మరియమ్మ వ్యాఖ్యలు వైరల్
  • పవన్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులతో ఊరంతా పార్టీ ఇస్తానన్న మరియమ్మ
  • ఆమె వ్యాఖ్యలకు చలించిపోయిన జన సైనికులు
  • తాజాగా పిఠాపురం వచ్చి ఆటో అందించిన నిర్మాత ఎస్‌కేఎన్
పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బులతో ఊరందరికీ పార్టీ ఇస్తానన్న మరియమ్మకు బేబీ సినిమా నిర్మాత ఎస్‌కేఎన్ (శ్రీనివాస్ కుమార్) ఆటో కొని బహుమానంగా ఇచ్చారు. నిన్న పిఠాపురం వచ్చిన ఆయన మరియమ్మకు ఆటో అందించి జనసైనికుల సమక్షంలో ఆటో తాళాలు అందించారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం జగ్గయ్య చెరువుకు చెందిన మరియమ్మ ఎన్నికలకు ముందు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..

పవన్ కల్యాణ్ తన కుమారుడని, ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే తన భర్త రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో ఊరందరికీ పార్టీ ఇస్తానని చెప్పింది. ఆమె వ్యాఖ్యలకు జనసేన నాయకులు, కార్యకర్తలు ఫిదా అయ్యారు. ఆమెకు అండగా నిలిచారు. కొందరు నగదు సాయం చేస్తే, మరికొందరు నిత్యావసర సరుకులు అందించారు. 

ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ కూడా ఆమె మాటలకు చలించిపోయారు. పవన్‌కు పెద్ద అభిమాని అయిన ఆయన పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే మరియమ్మకు ఆటో కొనిస్తానని అప్పట్లో ప్రకటించారు. అదికాస్తా నెరవేరడంతో నిన్న పిఠాపురం చేరుకున్న ఆయన అన్న మాట ప్రకారం మరియమ్మకు ఆటోను బహుమతిగా అందించారు. ఆ తర్వాత ఆమెను ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం స్వయంగా ఆటో నడిపారు.
Mariamma
Pithapuram
Pawan Kalyan
Producer SKN
Auto

More Telugu News