Chandrababu: ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం... అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి: చంద్రబాబు

Chandrababu in Visahka CII National counsel
  • రాష్ట్రంలో నైపుణ్య గణనపై దృష్టి సారించినట్లు వెల్లడి
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్న సీఎం
  • తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమన్న చంద్రబాబు
  • ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్, ఆగ్రో రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు వెల్లడి
ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని... మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.
Chandrababu
CII
Andhra Pradesh

More Telugu News