Anant Ambani: అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లికి 3 జెట్ లు సహా 100 విమానాల్లో అతిథులు!

Anant Ambani Radhika Merchant wedding 3 Falcon jets among 100 planes set to ferry guests says report

  • అద్దెకు తీసుకున్న ముకేశ్ అంబానీ కుటుంబం
  • ఈ నెల 12 నుంచి 15 వరకు అట్టహాసంగా జరగనున్న పెళ్లి వేడుకలు
  • పెళ్లి వేదికగా ముంబైలోని జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్
  • పెళ్లికి వచ్చే అతిథులకు ఇబ్బందుల్లేకుండా 3 రోజులపాటు అక్కడ ట్రాఫిక్ ఆంక్షల అమలు

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం జరిగే పెళ్లికి హాజరయ్యే అతిథులను తీసుకొచ్చేందుకు మూడు ఫాల్కన్ జెట్ లు సహా 100కుపైగా ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకున్నారు.

తమ సంస్థ నుంచి ఫాల్కన్–2000 రకానికి చెందిన మూడు జెట్ విమానాలను అంబానీ కుటుంబం అద్దెకు తీసుకుందని క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్రా ప్రముఖ వార్తాసంస్థ ‘హిందుస్థాన్ టైమ్స్’కు తెలిపారు. దేశం నలుమూలల నుంచి విచ్చేసే అతిథులను తీసుకొచ్చేందుకు ఒక్కో విమానం కొన్ని ట్రిప్పులు తిరగనుందని చెప్పారు. ఇందుకోసం 100కుపైగా ప్రైవేటు విమానాలు ఉపయోగించనున్నట్లు అంచనా వేశామన్నారు.

ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉన్న జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఈ నెల 12 నుంచి 15 వరకు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వీలుగా జియో వరల్డ్ ట్రేడ్ సమీప ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అర్ధరాత్రి వరకు పెళ్లి వేడుకల వాహనాలకు మాత్రమే ఈ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంది. ఈ మేరకు ముంబై ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ట్రావెల్ అడ్వయిరీ జారీ చేశారు.

ముకేశ్ అంబానీ ఇప్పటికే తన చిన్న కుమారుడి రెండు ప్రీ వెడ్డింగ్ వేడుకలను అత్యంత ఆర్భాటంగా నిర్వహించారు. మొదటి ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాన్ని గుజరాత్ లోని జామ్ నగర్ లో మార్చి 1 నుంచి 3వ తేదీ దాకా 3 రోజులపాటు సుమారు 2 వేల మంది అతిథులతో ధూంధామ్ గా చేపట్టారు. ఈ వేడుకల్లో భాగంగానే 51 వేల మంది స్థానికులకు అంబానీ కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. అనంతరం సుమారు 800 మంది కుటుంబ సన్నిహితులు, స్నేహితులతో కలిసి మే 29 నుంచి జూన్ 1 మధ్య 4 రోజులపాటు ఇటలీ నుంచి ఫ్రాన్స్ కు ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్ లో విహరిస్తూ రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.

అంబానీ కోడలు కాబోతున్న రాధికా మర్చంట్ ప్రముఖ ఫార్మా కంపెనీ ఎన్ కోర్ హెల్త్ కేర్ సీఈవో విరేన్ మర్చంట్–షైలా మర్చంట్ ల కుమార్తె. దేశంలోని దిగ్గజ ఫార్మా సంస్థల్లో ఇది కూడా ఒకటి. రాధికా మర్చంట్ ఆ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు.

Anant Ambani
Mukesh Ambani
Radhika Merchant
Marriage Celebrations
Mumbai
Jio World Trade Center
Guests
Chartered Planes
  • Loading...

More Telugu News