Mister Telangana: రోడ్డు ప్రమాదంలో ‘మిస్టర్ తెలంగాణ’ సోహైల్ మృతి

Mister Telangana Mohammed Sohail Dead In Bike Accident At Siddipet
  • బైక్ పై వేగంగా వెళుతూ ఆటోను ఢీకొట్టిన సోహైల్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్న సిద్ధిపేట యువకుడు
మిస్టర్ తెలంగాణ టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీబిల్డర్ మహ్మద్ సోహైల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్ పై వేగంగా దూసుకెళుతూ అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన సోహైల్ ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతను చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. బాడీ బిల్డర్ గా పలు ఛాంపియన్ షిప్ లు గెల్చుకున్న సోహైల్ వయసు కేవలం 23 ఏళ్లు మాత్రమే.

సిద్ధిపేట పట్టణానికి చెందిన మహ్మద్ సోహైల్ ప్రముఖ బాడీ బిల్డర్ గా పేరుతెచ్చుకున్నాడు. తన కెరీర్‌లో జిల్లా, రాష్ట్ర, సౌతిండియా బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను సొంతం చేసుకున్నాడు. చిన్న వయసులోనే సోహైల్ ‘మిస్టర్ తెలంగాణ’ టైటిల్ ను గెల్చుకున్నాడు. చిన్నవయసులోనే టౌన్ కు పేరుతెచ్చిన సోహైల్ చనిపోవడంపై సిద్ధిపేట వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Mister Telangana
Mohammed Sohail
Road Accident
Bike Accident

More Telugu News