Anand Mahindra: మ‌రో ఆస‌క్తిక‌ర వీడియో పంచుకున్న ఆనంద్ మ‌హీంద్రా!

Anand Mahindra Share Another Interesting Video on Twitter

  • 'మండే మోటివేషన్' పేరిట వీడియో పోస్ట్ చేసిన‌ వ్యాపార‌వేత్త‌
  • దారులు ఎలా ఉన్నా.. మీ గ‌మ్య‌స్థానాన్ని చేరుకోవ‌డం ఖాయ‌మంటూ ట్వీట్‌
  • సోష‌ల్ మీడియాలో ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్

ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త ఆనంద్ మ‌హీంద్రా సోషల్ మీడియాలో ఎ‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటార‌నే సంగ‌తి తెలిసిందే. సమాజానికి అవసరమయ్యే, సమాజంలో విలువలను గుర్తు చేసే పోస్ట్‌లతో పాటు మోటివేష‌న‌ల్‌ ట్వీట్స్‌ చేస్తుంటారాయ‌న‌. ఇదే కోవ‌లో తాజాగా ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ‌ వైర‌ల్ అవుతోంది. 

"రహదారి ఎంత కష్టమైనా సరే.. మీరు మీ గమ్యస్థానానికి క‌చ్చితంగా చేరుకుంటారు.." అనే లైన్ల‌తో ఆయ‌న 'మండే మోటివేషన్' పేరిట ఒక వీడియోను 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్‌ చేశారు. 

కాగా, వీడియోలో బాగా లోతైన గుంత‌లు క‌లిగిన రహ‌దారిపై డ్రైవింగ్ పోటీలు జ‌రుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అందులో ఓ వ్య‌క్తి ఒక జీపును బాగా లోతుగా ఉన్న గుంత‌లు, వాటి నిండా బురద ఉన్న ర‌హ‌దారిపై న‌డిపించ‌డం మ‌నం చూడొచ్చు. అంత‌టి గుంత‌ల‌మ‌య‌మైన ఆ ర‌హ‌దారిపై కూడా ఆ వ్య‌క్తి ఎంతో చాక‌చ‌క్యంగా జీపును డ్రైవ్ చేసి గ‌మ్య‌స్థానానికి చేర్చ‌డంతో వీడియో ముగుస్తుంది. ఆనంద్ మ‌హీంద్రా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ కాగా, నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

Anand Mahindra
Twitter
Monday Motivation
  • Loading...

More Telugu News