Manchu Manoj: కూతురు పేరును రివీల్ చేసిన మంచు మనోజ్.. మంచి పేరు పెట్టారంటున్న నెటిజ‌న్లు!

Manchu Manoj Mounica Daughter Name Goes Viral Manoj Shares Name Ceremony Photo
  • ఈ ఏడాది ఏప్రిల్‌లో మంచు మనోజ్, మౌనిక జంట‌కు పండంటి పాప‌
  • త‌మ కూతురుకి 'దేవసేన శోభ' అనే పేరు పెట్టినట్టు వెల్ల‌డి
  • ఆ పేరుతో పాటు బారసాల వేడుక‌ ఫొటోల‌ను కూడా పంచుకున్న మనోజ్
మంచు మనోజ్ భార్య మౌనిక ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాప‌కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మంచు వారింట్లో మహాలక్ష్మి పుట్టింది అని మనోజ్, మంచులక్ష్మీ ఈ విషయాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలిపారు. అయితే, ఇటీవల ఆ చిన్నారికి బారసాల నిర్వహించి పేరు పెట్టారు. తాజాగా మంచు మనోజ్ స్వయంగా ఆ పాప పేరును తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రివీల్ చేశాడు.

మంచు మనోజ్, మౌనిక దంపతుల కూతురుకి 'దేవసేన శోభ ఎంఎం' అనే పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించారు. అయితే దేవసేన శోభ అనే పేరుని సుబ్రహ్మణ్య స్వామి భార్య దేవసేన పేరు నుంచి తీసుకున్నామని, అలాగే శోభ అని దివంగత మా అత్తగారు శోభ నాగిరెడ్డి నుంచి తీసుకున్నామని మనోజ్ తెలిపారు. 

ఆ పేరుతో పాటు బారసాల వేడుక‌ ఫొటోల‌ను కూడా మనోజ్ పంచుకున్నాడు. ఇక ఆ చిన్నారి ఉయ్యాలలో ఉండగా మంచు మనోజ్, మౌనికతో పాటు మోహన్ బాబు ఫ్యామిలీ ఆస‌క్తిగా పాప‌ను గ‌మ‌నించ‌డం ఫొటోలో క‌నిపిస్తుంది. 

అలాగే మ‌రో ఫొటోలో మంచు మనోజ్, మౌనిక, కుమారుడు ధైరవ్, కూతురు దేవసేన శోభ ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మంచి పేరు పెట్టారంటూ చిన్నారికి ఆశీర్వా‌దాలు అందిస్తున్నారు.
Manchu Manoj
Mounica
Name Ceremony
Devasena Shobha MM
Tollywood

More Telugu News