Pakistan: 15 రోజుల నవజాత శిశువును బతికుండగానే పూడ్చిపెట్టిన తండ్రి!

Unable To Afford Treatment Pakistan Man Buries 15 Day Old Daughter Alive
  • పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసిన ఘటన
  • నవజాత శిశువు ఆసుపత్రి ఖర్చులు భరించలేక తండ్రి దారుణం
  • గోనె సంచిలో బిడ్డను ఉంచి పాతిపెట్టిన వైనం
  • పోలీసుల ముందు అంగీకరించిన నిందితుడు
15 రోజుల వయసున్న నవజాత శిశువును బతికుండగానే ఖననం చేశాడో తండ్రి. బిడ్డ ఆసుపత్రి ఖర్చులు భరించలేక ఈ పని చేశానని చెప్పాడు. గుండెలు పిండేసే ఈ హృదయవిదారక ఘటన పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. 

నిందితుడిని పోలీసులు తయ్యబ్‌గా గుర్తించారు. బిడ్డ ఖర్చులు ఆర్థికభారంగా మారడంతో ఈ పని చేశానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. చిన్నారిని ఓ గోనె సంచిలో పెట్టి పాతిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కాగా, కోర్టు ఆదేశానుసారం, చిన్నారి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

లాహోర్‌లోని డిఫెన్స్ ఏరియాలో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ జంట.. ఇంటిపని కోసం సహాయకురాలిగా నియమించుకున్న 13 ఏళ్ల బాలికను చిత్ర హింసలకు గురిచేసింది. టీనేజర్ దుస్తులు తొలగించి శారీరకంగా టార్చర్‌కు గురి చేసింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు హసమ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి భార్య కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
Pakistan
Crime News
man buries infant alive
Sindh Province

More Telugu News