Ashwaraopet SI Suicide: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి

ashwaraopet SI dies in hospital while undergoing treatment after suicide attempt
ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అశ్వారావు పేట (భద్రాద్రి కొత్తగూడెం) ఎస్సై శ్రీరాములు శ్రీను (38) మృతి చెందారు. జూన్ 30న మహబూబ్‌నగర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున చనిపోయారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఐ జితేందర్ రెడ్డి, పోలీస్ కానిస్టేబుళ్లు సన్యాసినాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ఎస్సై శ్రీరాములు శ్రీను భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి ఏడేళ్ల వయసున్న కుమార్తె, ఐదేళ్ల వయసున్న కుమారుడు ఉన్నారు.
Ashwaraopet SI Suicide
Telangana
Mahabubnagar District

More Telugu News