Chandrababu: ముగిసిన ముఖ్యమంత్రుల సమావేశం... సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం!

Chief Ministers meeting completed
  • సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయం
  • అధికారులతో ఓ కమిటీ, మంత్రులతో మరో కమిటీ వేయాలని నిర్ణయం
  • 1.45 గంటల పాటు సాగిన ముఖ్యమంత్రుల సమావేశం
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రులు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 6.10 గంటలకు ప్రారంభమైన సమావేశం 7.45 నిమిషాలకు ముగిసింది. సమావేశం 1.45 నిమిషాల పాటు సాగింది.

ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో మరో కమిటీని వేయాలని నిర్ణయించారు. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చ సాగింది. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని నిర్ణయించారు.
Chandrababu
Revanth Reddy
Andhra Pradesh
Telangana

More Telugu News