Chandrababu: ఓయూలో చంద్రబాబు, రేవంత్ రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకం

OU students praises AP CM Chandrababu
  • వివాదాల పరిష్కారం కోసం చంద్రబాబు ముందుకు రావడం హర్షణీయమని వ్యాఖ్య
  • ప్రారంభమైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
  • ప్రజాభవన్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల చిత్రపటానికి కొంతమంది విద్యార్థులు క్షీరాభిషేకం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ఇతర వివాదాల పరిష్కారం కోసం చంద్రబాబు ముందుకు రావడం హర్షణీయమని ఇక్కడి చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి తలారి శ్రీనివాస్ రావు అన్నారు.

చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైంది. ప్రజాభవన్‌లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రజాభవన్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు ముందుగా వచ్చారు. ఆ తర్వాత ప్రజాభవన్‌కు వచ్చిన చంద్రబాబు, ఏపీ మంత్రులు, అధికారులకు తెలంగాణ సీఎం, ఉపముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికారు.
Chandrababu
Revanth Reddy
Congress
Telangana
Andhra Pradesh

More Telugu News