Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ వార్తలపై సోనాక్షిసిన్హా స్పందన

Sonakshi Sinha response on pregnant rumours
  • గత నెలలో ప్రేమ వివాహం చేసుకున్న సోనాక్షి సిన్హా
  • ఆసుపత్రికి వెళ్తే ప్రెగ్నెంట్ అని ప్రచారం చేస్తున్నారని విమర్శ
  • ఇకపై ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదని వ్యాఖ్య
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా గత నెలలో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమె గర్భవతి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించారు. తాను గర్భవతి అనే ప్రచారంలో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. 

ఆసుపత్రికి వెళ్తే తాను ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం చేస్తున్నారని... అందుకే తాము ఆసుపత్రికి వెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను చూసేందుకు సోనాక్షి ఆసుపత్రికి వెళ్లారు. దీంతో, ఆమె గర్భవతి అంటూ ప్రచారాలు మొదలయ్యాయి. సోనాక్షి, ఇక్బాల్ ఇద్దరూ 'డబుల్ ఎక్స్ఎల్' సినిమాలో కలిసి నటించారు.
Sonakshi Sinha
Bollywood
Pregnant

More Telugu News