Chandrababu: జోరు వానలోనూ చంద్రబాబు ర్యాలీలో తెలంగాణ కార్యకర్తల ఉత్సాహం... ఫొటోలు ఇవిగో!

Chandrababu Naidu arrives to a tumultuous welcome
  • భారీ వర్షాన్ని లెక్కచేయకుండా బాబు కోసం ఎదురుచూసిన అభిమానులు
  • డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీగా ఇంటికి చేరిన చంద్రబాబు
  • నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారి హైదరాబాద్‌కు వచ్చారు. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు స్వాగతం పలకడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వరకు ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. రేపు సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివిధ అంశాలపై చర్చిస్తారు.

హైదరాబాద్‌లో ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ టీడీపీ కార్యకర్తలు దానిని లెక్క చేయకుండా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు వర్షంలోనే ఎదురు చూశారు. తన నివాసానికి ర్యాలీగా వెళ్లిన చంద్రబాబు టీడీపీ జెండాను చేతబట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. డప్పులు, కళాకారుల విన్యాసాలతో ర్యాలీ కొనసాగింది. నగరంలో పలుచోట్ల స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
   
Chandrababu
Telangana
Andhra Pradesh
Hyderabad

More Telugu News