TGPSC: టీజీపీఎస్‌సీ వ‌ద్ద‌ పోలీసులు రోడ్డు మీద పోయేవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు: బీఆర్ఎస్

BRS alleged Police arrests at will in front of TGPSC
టీజీపీఎస్‌సీని ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అదుపులోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పోలీసులు టీజీపీఎస్‌సీ వద్ద రోడ్డు మీద పోయేవాళ్ళని సైతం అరెస్ట్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. తాము ధ‌ర్నా కోసం రాలేద‌ని, రోడ్డు మీద వెళ్తున్నామ‌ని చెప్పినా వినిపించుకోకుండా అదుపులోకి తీసుకున్నారంటూ ఒక రైతు, ఒక లాయర్, ఆఫీసుకు వెళ్తున్న ఒక ఉద్యోగి వాపోయారంటూ బీఆర్ఎస్ తన ట్వీట్ లో పేర్కొంది. త‌మ‌ను వ‌దిలిపెట్టాల‌ని వారు పోలీసుల‌ను కోరుతున్న వీడియోను కూడా బీఆర్ఎస్ పార్టీ పంచుకుంది. ఈ అరెస్టుల‌ తాలూకు వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
TGPSC
Telangana

More Telugu News