Dog gold chain: కుక్కకు మూడున్నర తులాల బంగారు గొలుసు.. దాని సంతోషం అంతా ఇంతా కాదు.. వీడియో ఇదిగో

woman buys gold chain for pet dog Tiger viral video
  • ముంబైలో పెంపుడు శునకం ‘టైగర్’కు బంగారు గొలుసు కొన్న మహిళ
  • ఇందుకోసం రూ.2.5 లక్షలకు పైగా ఖర్చు
  • గొలుసు వేయగానే ఆనందంతో గంతులు వేసిన శునకం
కొందరికి తమ పెంపుడు జంతువుల పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది. అందులోనూ శునకాలపై మరింత శ్రద్ధ ఎక్కువ. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కొందరైతే ఏటా పుట్టినరోజులు కూడా చేస్తుంటారు. అలా తన పెంపుడు శునకానికి ఓ మహిళ ఏకంగా బంగారు గొలుసు బర్త్ డే గిఫ్ట్ గా వేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

రెండున్నర లక్షలు ఖర్చుపెట్టి..
ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన సల్దాన్హా అనే మహిళ ఇటీవల తన పెంపుడు శునకం ‘టైగర్’ను తీసుకుని అక్కడి ఫేమస్ జ్యువెలరీ షాప్ అనిల్ జ్యువెలర్స్ కు వెళ్లింది.
  • అక్కడ తన పెంపుడు శునకం కోసం ఒక బంగారు చైన్ కొని.. అక్కడే దాని మెడలో కూడా వేసింది. బంగారు చైన్ వేయగానే శునకం ఆనందంగా అటూ ఇటూ గంతులు వేయడం గమనార్హం. అనిల్ జ్యువెలర్స్ యజమాని పీయూష్ జైన్ దీనికి సంబంధించిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు.
  • సల్దాన్హా తన శునకం కోసం 35 గ్రాముల బంగారు గొలుసు కొన్నదని, దాని విలువ రూ.2.5 లక్షలు అని పీయూష్ జైన్ తెలిపారు. 
  • ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. వేలకొద్దీ వ్యూస్, లైకులు వస్తున్నాయి.
  • శునకంపై ఆ మహిళ ప్రేమను చాలా మంది మెచ్చుకున్నారు. అంతేకాదు.. ‘టైగర్’కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు.
Dog gold chain
offbeat
Viral Videos
Instagram
mumbai

More Telugu News