Kalisetti Appala Naidu: ఎంపీగా అందుకున్న మొదటి నెల జీతాన్ని అమరావతికి విరాళంగా ఇచ్చిన కలిశెట్టి అప్పలనాయుడు

TDP MP Kalisetti Appala Naidu Donate His First Salary To Capital City Amaravati
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతికి మంచిరోజులు వచ్చాయి. ఆగిపోయిన నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. రాజధానికి దారితీసే రోడ్లు మళ్లీ కళకళలాడుతున్నాయి. ఇక, అమరావతి నిర్మాణంలో నేను సైతం అంటూ విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముందుకొచ్చారు.

ఎంపీగా అందుకున్న తొలి నెల వేతనం రూ. 1.57 లక్షల చెక్కును అమరావతి నిర్మాణం కోసమంటూ ఇతర ఎంపీల సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అందించారు. అమరావతిపై ప్రేమను చాటుకున్న ఎంపీని చంద్రబాబు అభినందించారు.
Kalisetti Appala Naidu
Vizianagaram
Chandrababu
Amaravati

More Telugu News