Varalaxmi-Nicholai Reception: నటి వరలక్ష్మీశరత్‌కుమార్ రిసెప్షన్.. పోటెత్తిన తారలు

Tollywood and all woods actors and politicians presents Varalaxmi and Nicholai reception

  • ఈ నెల 2న థాయ్‌లాండ్‌లో వివాహం
  • హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు
  • సందడి చేసిన బాలయ్య, వెంకటేశ్, రోజా, రమ్యకృష్ణ

చెన్నైలో నిన్న జరిగిన  కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్-నికోలయ్ సచ్‌దేవ్ వివాహ రిసెప్షన్‌లో రాజకీయ, సినీ ప్రముఖులు సందడి చేశారు. థాయ్‌లాండ్‌లో ఈ నెల 2న వీరి వివాహం గ్రాండ్‌గా జరగ్గా, చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 

రిసెప్షన్‌కు హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వధూవరులను ఆశీర్వదించారు. ఉదయనిధి స్టాలిన్, పన్నీర్ సెల్వం, దేవా, బాల, సిల్వ, ఆర్బీ చౌదరి, జితన్ రమేశ్, జీవా, దళపతి విజయ్, నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, తమన్, వెంకటేశ్, రజనీకాంత్, సురేశ్ గోపీ, సుదీప్, రోజా, సెల్వమణి, జాకీష్రాఫ్, ఏఆర్ రహ్మాన్, మణిరత్నం, సిద్ధార్థ్, అట్లీ, ప్రభుదేవా, విజయ్ ఆంథోనీ, అరుణ్ విజయ్, రమ్యకృష్ణ, ఐశ్వర్య రజనీకాంత్, ఖుష్బూ, శోభన, సుహాసిని, మంచు లక్ష్మి తదితరులు రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Varalaxmi-Nicholai Reception
Kollywood
Sarathkumar
Radhika
Balakrishna
Venkatesh
Roja
Suhasini
  • Loading...

More Telugu News