Capgemini: జగన్.. ఏపీ అంటే నీకు ఎందుకంత ద్వేషం?: టీడీపీ

Telugudesam party serious on YCP chief Jagan on Capgemini tweet
  • క్యాప్‌జెమినీ చెన్నైకి తరలిపోయిందంటూ వైసీపీ పోస్ట్
  • టీడీపీ కూటమి తీరుతోనేనని ఆరోపణ
  • క్యాప్‌జెమినీతో చర్చలు జరిపిన విషయం కనీసం వారికైనా తెలుసా? అని జగన్‌కు టీడీపీ ప్రశ్న
  • సైకోలా ఏపీపై పడి ఎందుకలా పీడించుకు తింటున్నావని నిలదీత
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై తెలుగుదేశం పార్టీ మరోమారు నిప్పులు చెరిగింది. మా ఏపీ మీద సైకోలా పడి ఎందుకలా పీడించుకు తింటున్నావని, ఆంధ్రప్రదేశ్ అంటే ఎందుకంత ద్వేషమని ప్రశ్నించింది.

తెలుగుదేశం పార్టీ ఇలా విరుచుకుపడడానికి కారణం కూడా ఉంది.  ఐటీ కంపెనీ క్యాప్ జెమినీ జగన్ హయాంలో రూ.1000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్టణానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని, కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వ తీరుతో ఇప్పుడు చెన్నైకి తరలిపోయిందంటూ వైసీపీ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కంపెనీలను ఆదరించే విధానం ఇదేనా? అని ప్రశ్నించింది.

ఈ పోస్టుపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. అసలు నువ్వు క్యాప్‌జెమినీతో చర్చలు జరిపిన విషయం వారికైనా తెలుసా? అని ఎద్దేవా చేసింది. నీ ముఖానికి సూట్‌కేసు కంపెనీలు తప్ప ఎన్నడైనా ఉద్యోగాలు తెచ్చే కంపెనీల గురించి తెలుసా? అని జగన్‌ను ప్రశ్నించింది.
Capgemini
Telugudesam
Jagan
Visakhapatnam
Andhra Pradesh

More Telugu News