CM Chandrababu: ప్ర‌ధాని మోదీతో సీఎం చంద్ర‌బాబు భేటీ

CM Chandrababu Meeting with PM Modi
ఢిల్లీ వెళ్లిన‌ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు ఇత‌ర‌ అంశాల‌పై ప్ర‌ధానితో చ‌ర్చించారు. అంత‌కుముందు చంద్ర‌బాబు కేంద్ర‌మంత్రి పీయూష్ గోయ‌ల్‌తో దాదాపు అర‌గంట పాటు ముచ్చ‌టించారు. ఈ స‌మావేశంలో సీఎంతో పాటు రాష్ట్రానికి చెందిన‌ ఎన్‌డీఏ ఎంపీలు కూడా పాల్గొన్నారు. 

నేడు ఢిల్లీలో చంద్ర‌బాబు మీటింగ్స్ ఇలా..
మ‌ధ్యాహ్నం 12.15 గంట‌ల‌కు నితిన్ గ‌డ్క‌రీ, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌, మ‌. 2.45 గంల‌కు అమిత్ షా, సాయంత్రం 5.15 గంట‌ల‌కు మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌, సాయంత్రం 6 గంట‌ల‌కు హ‌ర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు.
CM Chandrababu
PM Modi
Andhra Pradesh

More Telugu News