Pak Female Journalist: లైవ్ రిపోర్టింగ్‌లో పాక్ మహిళా జర్నలిస్టుకు భయంకర అనుభవం.. వీడియో ఇదిగో!

Bull interrupts live TV coverage hits Pakistani female journalist
  • ఎద్దుల ధరలపై వ్యాపారులతో మాట్లాడిన రిపోర్టర్
  • రిపోర్టింగ్ ఇస్తుండగా వెనక నుంచి దాడిచేసిన ఎద్దు
  • ఎగిరి అల్లంత దూరాన పడిన మహిళా జర్నలిస్ట్
  • వీడియోకు ఇప్పటికే మిలియన్‌కుపైగా వ్యూస్
ఎద్దుల జంట ధరపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. రిపోర్టింగ్ ఇస్తుండగా ఓ ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె అమాంతం ఎగిరిపడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే, ఇది సరిగ్గా ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు.

వ్యాపారులు ఎద్దుల జంటలను రూ. 5 లక్షల కంటే తక్కువకు అమ్మేందుకు సిద్ధంగా లేరని ఆమె చెబుతుండగానే వెనక నుంచి వచ్చిన ఎద్దు కుమ్మి పడేసింది. ఆమె కేకలు వేస్తూ అంత దూరాన పడింది. చెల్లాచెదురుగా పడిన ఆమె మైక్రోఫోన్, మౌత్‌ను తీసుకొచ్చిన ఓ వ్యాపారి ఆమెకు అందించాడు. గాయపడిన ఆమె అతికష్టంగా లేచి నిలబడింది. 

ఈ వీడియోకు ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై యూజర్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. లైవ్ రిపోర్టింగ్‌లో ఇదో అకస్మాత్తు పరిణామమని కొందరు కామెంట్ చేశారు. ఫీల్డ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని మరికొందరు సలహా ఇచ్చారు.
Pak Female Journalist
Bull Attack
Live Reporting

More Telugu News