Virat Kohli: బెరిల్ హరికేన్‌ భ‌యంక‌ర దృశ్యాల్ని.. భార్య‌ అనుష్కకు వీడియో కాల్‌లో చూపించిన కోహ్లీ!

Virat Kohli shows Hurricane Beryl to Anushka Sharma on video call
  • బార్బడోస్‌లో చిక్కుకుపోయిన టీమిండియా
  • తాను బ‌స చేసిన రిసార్ట్ బాల్క‌నీలో నిల‌బ‌డి భార్య‌కు కోహ్లీ వీడియో కాల్
  • విరాట్ వీడియోలో బెరిల్ తుపాను ప్రమాదకర దృశ్యాలు
టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీమిండియా 13 ఏళ్ల‌ తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడింది. అయితే, మ్యాచ్ ముగిసి నాలుగైదు రోజులు అవుతున్నా ఇప్ప‌టికీ భార‌త జ‌ట్టు బార్బడోస్‌లో చిక్కుకుపోయింది. దీనికి కారణం బెరిల్ హరికేన్. దీంతో ఆదివారం నుంచి భార‌త‌ జట్టు మొత్తం బార్బడోస్ హోటల్‌లోనే ఉండిపోయింది. ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీకి సంబంధించిన వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విరాట్ త‌న భార్య‌ అనుష్క శర్మకు వీడియో కాల్‌లో తుపాను తాలూకు భయంకరమైన దృశ్యాల‌ను చూపించ‌డం క‌నిపిస్తోంది.  

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. సముద్రానికి ఎదురుగా ఉన్న రిసార్ట్‌లో బస చేసిన‌ విరాట్ కోహ్లీ దాని బాల్కనీలో నిలబడి, వీడియో కాల్‌లో తన భార్య అనుష్క శర్మకు బలమైన అలలు, గాలులను చూపించ‌డం వీడియోలో ఉంది. ఒక‌వైపు నుంచి తుపాన్ దృశ్యాన్ని చూపించిన తర్వాత బాల్కనీకి మరో వైపు వెళ్లడం కూడా వీడియోలో కనిపిస్తోంది. బెరిల్ తుపాను ప్రమాదకర దృశ్యాన్ని మ‌నం ఈ వీడియోలో చూడవచ్చు. ఇక వీడియో తీసిన స‌మ‌యంలో విరాట్ వైట్‌ ట్రాక్ ప్యాంట్‌, బ్రౌన్ టీ-షర్టు, తలపై టోపీ ధరించ‌డం క‌నిపించింది. 

ఇక జూన్ 29న జ‌రిగిన టీ20 ప్రపంచ కప్ 2024 ఫైన‌ల్ మ్యాచ్‌లో విజ‌యం సాధించి టీమిండియా ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆదివారం రిజర్వ్ డే కావ‌డంతో భారత జట్టు త‌ర్వాతి రోజు రాత్రి తిరిగి స్వ‌దేశానికి ప‌య‌నం కావాల్సి ఉంది. అయితే ఈలోగా తుపాను కారణంగా మొత్తం ప్లాన్ రివ‌ర్స్ అయింది. దాంతో జట్టు అక్కడే ఇరుక్కుపోయింది. మొత్తం టీమ్‌తో పాటు సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు కూడా ఒకే హోటల్‌లో బస చేస్తున్నారు. కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం టీమిండియా రేపు (గురువారం) స్వ‌దేశానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.
Virat Kohli
Hurricane Beryl
Anushka Sharma
Barbados
Team India
T20 World Cup 2024
Cricket

More Telugu News