బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్
- నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం మోతీలాల్ నాయక్ దీక్ష
- వారం రోజులుగా గాంధీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్
- పరామర్శించేందుకు గాంధీకి వెళ్లిన ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన పోలీసులు
ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం మోతీలాల్ నాయక్ వారం రోజులుగా గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించేందుకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నిన్న మోతీలాల్ నాయక్తో కాసేపు చర్చలు జరిపారు.