Nara Lokesh: మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు: నారా లోకేశ్‌

Nara Lokesh Tweet on Pension Distribution
  • ఏపీ వ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ పెన్ష‌న్ల పంపిణీ
  • ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించిన సీఎం
  • హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ పింఛనుదారులు
  • 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన మంత్రి నారా లోకేశ్‌
  • ఈరోజు అవ్వాతాతల కళ్ల‌ల్లో చూసిన ఆనందం జీవితాంతం గుర్తుంటుంద‌న్న మంత్రి
ఏపీ వ్యాప్తంగా సోమ‌వారం ఉద‌యం నుంచి పెన్ష‌న్ల పంపిణీ కొన‌సాగుతోంది. దీంతో పింఛ‌న్లు అందుకున్న‌ వృద్ధులు, విక‌లాంగులు, వితంతువులు, ఇత‌రులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం ‘ఎన్టీఆర్ భరోసా’ సామాజిక పింఛన్ల పథకాన్ని ప్రారంభించిన అనంత‌రం మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పింఛనుదారులకు స్వ‌యంగా పెన్ష‌న్ అంద‌జేశారు. 

ఇక పింఛ‌న్ పంపిణీపై మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. "ఈరోజు అవ్వాతాతల కళ్ల‌ల్లో నేను చూసిన ఆనందం, చిరునవ్వు నా జీవితాంతం గుర్తుంటుంది. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య ఉన్న తేడా ఈరోజు ప్రజలకు అర్థమైంది. మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు.. విడతల వారీ డ్రామాలు లేవు.. అడ్డమైన నిబంధనలు అసలే లేవు.. ఇచ్చిన హామీ ప్రకారం పెద్ద కొడుకుగా పెన్షన్ రూ.4 వేలు చేశారు చంద్రన్న. అరియర్స్ తో కలిపి రూ.7 వేల పెన్షన్ ఇంటి వద్దనే అందజేశారు" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News