Sabitha Indra Reddy: పార్టీ మారుతున్నారనే ప్రచారంపై సబితా ఇంద్రారెడ్డి స్పందన ఇదే..!

Sabita Indrareddy Clarity About joining in Congress Party
  • సబిత కాంగ్రెస్ లో చేరుతారంటూ ప్రచారం
  • అవన్నీ అవాస్తవమేనని కొట్టిపారేసిన మాజీ మంత్రి
  • పార్టీ మారాల్సిన అవసరం కానీ, ఆలోచన కానీ తనకు లేవని క్లారిటీ 
బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతుండడంతో సీనియర్ లీడర్లు కూడా పార్టీ మారేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లోకి జంప్ అయ్యేందుకు సిద్దమయ్యారని వార్తలు వెలువడ్డాయి. అధికార పార్టీ సబితకు మంత్రి పదవి, ఆమె తనయుడికి నామినేటెడ్ పదవి ఆఫర్ చేసిందని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రచారంపై తాజాగా సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చిచెప్పారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తనకు సముచిత స్థానం కల్పించారని వివరించారు. పార్టీ మారాల్సిన అవసరం కానీ, మారే ఆలోచన కానీ తనకు ఎంతమాత్రమూ లేవన్నారు. బీఆర్ఎస్ లోనే కొనసాగుతూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని మాజీ మంత్రి సబిత స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని ప్రసార మాధ్యమాలకు విజ్ఞప్తి చేస్తున్నా.. అంటూ ట్వీట్ చేశారు.
Sabitha Indra Reddy
BRS
Party Change
Congress
Ex Minister sabita
Twitter

More Telugu News