Chandrababu: మీతో మరో కప్ తాగాలనుకుంటున్నాను... ప్రధాని మోదీ అరకు కాఫీ ట్వీట్ పై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu replies to PM Modi Araku Coffee tweet
  • 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగిన మోదీ
  • ఫొటోలు షేర్ చేసిన ప్రధాని
  • మోదీకి కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
ప్రధాని నరేంద్ర మోదీ అరకు కాఫీ గురించి ప్రస్తావిస్తూ, 2016లో చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ తాగుతున్నప్పటి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. 

"మా గిరిజన సోదరసోదరీమణులు ప్రేమతో, అత్యంత శ్రద్ధాసక్తులతో అరకు కాఫీని  సాగు చేస్తారు. అరకు కాఫీ సుస్థిరత, గిరిజన సాధికారత, ఆవిష్కరణకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపీ ప్రజల హద్దుల్లేని శక్తిసామర్థ్యాలకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. 2016లో మనం అరకు కాఫీ తాగుతున్న ఫొటోలను షేర్ చేసినందుకు, అచ్చంగా ఏపీలోనే ఉత్పత్తి అవుతున్న అరకు కాఫీకి ప్రచారం కల్పిస్తున్నందుకు థాంక్యూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారూ. మీతో మరో కప్ అరకు కాఫీ తాగుతూ ఎంజాయ్ చేయాలని ఎదురుచూస్తున్నాను" అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Narendra Modi
Araku Coffee
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News