T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 అవార్డుల లిస్ట్ ఇదే.. అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు ఆఫ్ఘనిస్థాన్ ఆటగాళ్లకే

Here is the list T20 World Cup 2024 Award Winners in different Category
  • ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా
  • అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా ఆఫ్ఘనిస్థాన్ ప్లేయర్‌తో తొలి స్థానంలో నిలిచిన అర్షదీప్ సింగ్
  • అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన ఆఫ్ఘాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్
దాదాపు నెల పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన టీ20 వరల్డ్ కప్ 2024 శనివారంతో ముగిసింది. భారత్ - దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్‌తో టోర్నీ సమాప్తం అయింది. బార్బడోస్‌ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 7 పరుగులతో జయకేతనం ఎగురవేసి విశ్వవిజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. 

కాగా టోర్నమెంట్ ముగియడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు టీ20 వరల్డ్ కప్ 2024 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. భారత్ రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఈ టోర్నీలో15 వికెట్లు తీశాడు. ఇక ఎకానమీ కేవలం 4.17గా మాత్రమే ఉంది. ప్రత్యర్థుల బ్యాటర్లను అద్భుతంగా నియంత్రించాడు. భారత బౌలింగ్ దళానికి నాయకత్వం వహించడంతో అతడికి ఈ అవార్డు దక్కింది.

ఇక మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్ ఫజల్‌హాక్ ఫరూఖీతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. వీరిద్దరూ టోర్నీలో చెరో 17 వికెట్లు తీశారు. కాగా ఫైనల్ మ్యాచ్‌లో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన అతడు 17 వికెట్లతో నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఏ ఎడిషన్‌లోనైనా ఒక ఆటగాడికి ఇవే అత్యధిక వికెట్లుగా ఉన్నాయి. ఇక 281 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ (257 పరుగులు), ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (255 పరుగులు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.

టీ20 ప్రపంచ కప్ 2024 అవార్డు విజేతల జాబితా ఇవే..
1. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ - జస్ప్రీత్ బుమ్రా (15 వికెట్లు, ఎకానమీ రేటు 4.17)
2. ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - విరాట్ కోహ్లీ (76 పరుగులు)
3. స్మార్ట్ క్యాచ్ ఆఫ్ ది ఫైనల్ - సూర్యకుమార్ యాదవ్
4. అత్యధిక పరుగులు - రహ్మానుల్లా గుర్బాజ్ (281 పరుగులు)
5. అత్యధిక వికెట్లు - అర్ష్‌దీప్ సింగ్, ఫజల్‌హాక్ ఫరూఖీ (17 వికెట్లు)
6. అత్యధిక వ్యక్తిగత స్కోరు - నికోలస్ పూరన్ (98, ఆఫ్ఘనిస్థాన్‌పై)
7. అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు - ఫజల్‌హాక్ ఫరూకీ (9 పరుగులకు 5 వికెట్లు, ఉగాండాపై)
8. అత్యధిక స్ట్రైక్ రేట్ - షాయ్ హోప్ (187.71)
9. బెస్ట్ ఎకానమీ రేట్ - టిమ్ సౌథీ (3.00)
10. అత్యధిక సిక్సర్లు - నికోలస్ పూరన్ (17 సిక్సులు)
11. అత్యధిక 50+ స్కోర్లు - రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్ (చెరో 3)
12. అత్యధిక క్యాచ్‌లు - ఐడెన్ మార్క్‌రమ్ (8 క్యాచ్‌లు).
T20 World Cup 2024
Cricket
ICC
ICC Awards

More Telugu News