Pawan Kalyan: పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటనలో చెలరేగిన జేబుదొంగలు

Pickpocketers loots at Kondagattu during Pawan Kalyan visit
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. పవన్ స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ రాకతో కొండగట్టులో భారీ కోలాహలం నెలకొంది. అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు.

ఇదే అదనుగా జేబుదొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో జనాలు అతడిని పట్టుకుని చితకబాదారు. అతని నుంచి రూ.5 వేలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.
Pawan Kalyan
Kondagattu
Pickpocketers
Janasena
Telangana

More Telugu News