Drugs: పబ్‌లలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు డీజేల అరెస్ట్

DJs arrested for selling drugs
  • బంజారాహిల్స్‌లో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడిన డీజేలు అఖిల్, సన్నీ
  • నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
  • బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి పబ్‌లలో పరిచయమైన వారికి సరఫరా
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇద్దరు డీజేలు డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. అరెస్టైన వారిని పలు పబ్బుల్లో డీజేలుగా పని చేస్తున్న అఖిల్, సన్నీగా గుర్తించారు. నిందితుల నుంచి ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను పబ్‌లలో తమకు పరిచయమైన వారికి సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరు ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Drugs
Pub
DJ

More Telugu News