Nampalli Court: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు కోర్టులో చుక్కెదురు

Court rejected bail to Phone tapping accused
  • భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురు
  • పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు
  • 90 రోజుల్లోనే ఛార్జిషిట్ దాఖలు చేశామని వాదనలు వినిపించిన పోలీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, ప్రణీత్ రావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లను కోర్టు కొట్టివేసింది. పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాము నిబంధనల మేరకు 90 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు.
Nampalli Court

More Telugu News