BJP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి కుమారస్వామిని కలిసిన ఏపీ బీజేపీ ఎంపీలు

AP BJP MPs meets Union Minister Kumaraswamy
  • పురందేశ్వరి ఆధ్వర్యంలో కేంద్రమంత్రిని కలిసిన ఎంపీలు
  • విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని వినతిపత్రం
  • ఏపీ బీజేపీ ఎంపీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిశారు. బుధవారం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆధ్వర్యంలో వారు కేంద్రమంత్రిని కలిశారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. వారి విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్‌ను లాభాలబాట పట్టించే అంశాలపై కేంద్రమంత్రితో వీరు చర్చించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను వివరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. బీజేపీ ఎంపీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కుమారస్వామి మరోసారి సమావేశమవుదామని తెలిపారు. కేంద్రమంత్రిని కలిసిన వారిలో కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు ఉన్నారు.
BJP
Daggubati Purandeswari
Kumara Swamy

More Telugu News