Pawan Kalyan: ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

AP Dy CM Pawan Kalyan Visit Kondagattu Temple On June 29
  • అంజన్నకు ప్రత్యేక పూజలు చేయనున్న జనసేనాని
  • వారాహి దీక్ష కొనసాగిస్తున్న పవన్
  • స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో బుధవారం సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఈ నెల 29న తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి రానున్నారు. వారాహి దీక్షలో ఉన్న పవన్.. కొండగట్టు అంజన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాక తొలిసారి కొండగట్టుకు వస్తున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ వారాహి దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. 11 రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా పవన్ కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నారు.

మరోవైపు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులతో భేటీ అయ్యారు. కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు.
Pawan Kalyan
AP Dy CM
Kondagattu
Varahi Deeksha
Janasena

More Telugu News