Aditi Rao Hydari: హీత్రూ విమానాశ్రయం అంత చెత్తది మరొకటి లేదు.. నటి అదితీరావు హైదరి మండిపాటు

Bollywood actress Aditi Rao calls Heathrow airport the worst
  • హీత్రూ విమానాశ్రయంలో తన లగేజీ మాయమైందన్న అదితి
  • దాని కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చిందని ఆవేదన
  • అడిగితే అధికారులు చేతులెత్తేశారని మండిపాటు
  • త్వరలోనే సిద్ధార్థ్‌తో పెళ్లి పీటలు ఎక్కనున్న నటి
యూకేలోని హీత్రూ విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నటి అదితీరావు హైదరి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. తన లగేజీ మాయమైందని, దానికోసం గంటల తరబడి విమానాశ్రయంలో ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను అడిగితేనేమో వారు చేతులెత్తేశారని, సంబంధిత ఎయిర్‌లైన్ ను సంప్రదించమన్నారని పేర్కొన్నారు. ఇంత చెత్త ఎయిర్‌పోర్టును తానెప్పుడూ చూడలేదంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

నటుడు సిద్ధార్థ్‌తో త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న అదితి ఇటీవల సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ ‘హీరామండి’లో కనిపించారు. ఇందులో ఆమె నటించిన ‘బిబోజాన్’ పాత్రకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ‘గాంధీటాక్స్’, ‘లయోనెస్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.
Aditi Rao Hydari
Siddharth
Heathrow Airport
Bollywood

More Telugu News