Telangana: తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని తిలకించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy in Parliament to meet JP Nadda
  • ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించిన కోమటిరెడ్డి, గడ్డం వివేక్ కూడా 
  • లోక్ సభ గ్యాలరీలో సోనియాను కలిసిన రేవంత్ రెడ్డి
  • తెలంగాణకు నిధుల కోసం నడ్డాను కలుస్తానని మీడియాతో సీఎం
పార్లమెంట్‌లో తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిలకించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే గడ్డం వివేక్ తెలంగాణ ఎంపీల ప్రమాణాన్ని వీక్షకుల గ్యాలరీ నుంచి చూశారు. లోక్ సభ గ్యాలరీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీని కలిశారు.

పార్లమెంట్‌లోనికి వెళ్లడానికి ముందు ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పార్లమెంట్‌లో కేంద్రమంత్రి జేపీ నడ్డాను కూడా కలుస్తానని చెప్పారు. తెలంగాణకు సంబంధించి పలు ఇష్యూలు ఉన్నాయని, గత ప్రభుత్వ హయాంలో తమకు నిధులు విడుదల కాలేదని, వాటి విడుదల కోసం నడ్డాను కలుస్తున్నట్లు చెప్పారు.
Telangana
Revanth Reddy
Lok Sabha
Congress
BJP
JP Nadda

More Telugu News