Pawan Kalyan: పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ చేపట్టిన శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతున్న జనసేన

Janasena invites suggestions from people

  • ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎమ్మెల్యేలుగా 21 మంది విజయం
  • పవన్, నాదెండ్ల, కందుల దుర్గేశ్ లకు మంత్రి పదవులు
  • క్యూఆర్ కోడ్, గూగుల్ ఫారం ద్వారా సలహాలు, సూచనలు కోరుతూ జనసేన ప్రకటన

జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పదవిని మాత్రమే కాకుండా... పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలను కూడా చేపట్టారు. 

అదే సమయంలో, జనసేన తరఫున గెలిచిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిగా, కందుల దుర్గేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 

ఈ నేపథ్యంలో, జనసేన నేతలు చేపడుతున్న ఆయా మంత్రిత్వ శాఖలపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరుతూ జనసేన పార్టీ ప్రకటన చేసింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేయడం ద్వారా, లేకపోతే గూగుల్ ఫారం నింపడం ద్వారా సలహాలు, సూచనలు అందజేయవచ్చని జనసేన పేర్కొంది. 

ఈ మేరకు క్యూఆర్ కోడ్ ను, గూగుల్ ఫారం (https://forms.gle/8Y3rRtY1dewPQAyH7) లింకును సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Loading...

More Telugu News