Anand Mahindra: మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవ‌ద్దు.. ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర‌ ట్వీట్‌..!

Never underestimate yourself Anand Mahindra Monday Motivation Tweet goes Viral

  • 'మండే మోటివేషన్' పేరిట స్ఫూర్తివంతమైన వీడియో పంచుకున్న వ్యాపార‌వేత్త‌
  • మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండ‌బ‌లం మీకు ఉండవచ్చు అనే లైన్‌తో వీడియో పోస్ట్‌
  • సోష‌ల్ మీడియాలో ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్

వ్యాపార వేత్త ఆనంద్ మ‌హీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటార‌నే విష‌యం తెలిసిందే. సమాజానికి అవసరమయ్యే, సమాజంలో విలువలను గుర్తు చేసే పోస్ట్‌లతో పాటు మోటివేష‌న‌ల్‌ ట్వీట్స్‌ చేస్తుంటారాయ‌న‌. ఇదే కోవ‌లో తాజాగా ఆనంద్‌ మహీంద్రా చేసిన ట్వీట్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతోంది. 

"మిమ్మల్ని మీరు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోవ‌ద్దు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కండ‌బ‌లం మీకు ఉండవచ్చు" అనే లైన్ల‌తో ఆయ‌న ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. 

మండే మోటివేషన్ పేరిట ఆనంద్ మహీంద్రా పంచుకున్న ఈ స్ఫూర్తివంతమైన వీడియో నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. వీడియోలో ఓ బ‌క్క‌ప‌ల‌చ‌ని వ్య‌క్తి.. కండ‌ల‌వీరుడిగా ఉన్న మ‌రో వ్య‌క్తి చేతిప‌ట్టులో ఓడించ‌డం ఉంది. కాగా, టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఆదివారం సూప‌ర్‌-8 మ్యాచ్‌లో బ‌ల‌మైన‌ ఆస్ట్రేలియాను ప‌సికూన ఆఫ్ఘ‌నిస్థాన్ మ‌ట్టిక‌రిపించిన‌ విష‌యం తెలిసిందే. దీన్ని ఉద్దేశిస్తూ ఉన్న వీడియోనే ఆనంద్ మ‌హీంద్రా పంచుకున్నారు.

Anand Mahindra
Twitter
Monday Motivation
  • Loading...

More Telugu News