విజయశాంతి ​బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. రాములమ్మ కొత్త మూవీ నుంచి పవర్​ఫుల్ గ్లింప్స్​ విడుద‌ల‌!

Vijayashanthi is playing a police officer in Nandamuri Kalyan Ram new film
  • నేడు విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు
  • నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ కొత్త‌ మూవీ 'ఎన్‌కేఆర్‌21'లో ఐపీఎస్‌ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో రాముల‌మ్మ‌
  • ఎన్‌కేఆర్‌21 పేరిట తెర‌కెక్కున్న ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకుడు
  • అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం
నేడు ప్రముఖ నటి విజ‌య‌శాంతి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న కొత్త చిత్రం నుంచి మేక‌ర్స్ ఓ పోస్ట‌ర్‌తో పాటు పవర్‌ఫుల్‌ గ్లింప్స్ ను విడుద‌ల చేశారు. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ మూవీలో ఆమె ఐపీఎస్‌ ఆఫీస‌ర్‌ పాత్ర‌లో న‌టిస్తున్నారు. 'ఎన్‌కేఆర్‌21' పేరిట తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

ఇక ఆమె నటించిన పలు హిట్ చిత్రాల్లో కర్త్యవం కూడా ఒకటి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్ర ఆమెకు బాగా పేరు తెచ్చిపెట్టింది. చాలా కాలం త‌ర్వాత ఆమె మ‌రోసారి క‌ల్యాణ్‌రామ్ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నారు. ఇక గ్లింప్స్‌లో ఆమె కొంత‌మంది పోలీసుల‌తో క‌లిసి ఒక ప్ర‌త్యేక‌మైన మిషన్‌లో ఉన్న‌ట్లు చూపించారు. విజయశాంతి డ్యూటీ మైండెడ్, ఎవరినీ పట్టించుకోని ఐపీఎస్ ఆఫీసర్‌గా పవర్ ఫుల్ ఎంట్రీ ఇవ్వ‌డం చూడొచ్చు. 

"వైజ‌యంతి ఐపీఎస్. తను పట్టుకుంటే పోలీసు తుపాకీకి ధైర్యం వస్తుంది. వేసుకుంటే యూనిఫామ్ కు పౌరుషం వస్తుంది. తనే ఒక యుద్ధం. నేనే తన సైన్యం" అంటూ విజయ శాంతిని ఉద్దేశిస్తూ కల్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ గ్లింప్స్‌తో చిత్రం యూనిట్‌ మూవీపై అంచ‌నాలు పెంచేసింది.

ఇక ఈ మూవీని అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. కెమెరామెన్‌గా రామ్ ప్రసాద్ ప‌నిచేస్తున్నారు. అలాగే అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ప్రధాన నటీనటులు పాల్గొంటున్న ఎన్‌కేఆర్‌21 షూటింగ్ ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 
Go Back to Shorts
Vijayashanthi
Nandamuri Kalyan Ram
Tollywood

More Telugu News