Kalisetti Appala naidu: సైకిల్ పై పార్లమెంట్ కు వెళ్లిన ఎంపీ అప్పలనాయుడు.. వీడియో ఇదిగో!

vijayanagaram mp kalisetty appala naidu bicycle ride to parliament
  • తనకు సీటు ఇచ్చి పార్లమెంట్ కు పంపిందని కృతజ్ఞత
  • ఢిల్లీలోని తన గెస్ట్ హౌస్ నుంచి పార్లమెంట్ కు సైకిల్ సవారీ
  • తల్లికి పాదాభివందనం చేసి బయలుదేరిన ఎంపీ అప్పల నాయుడు
తొలిసారి లోక్ సభకు ఎంపికైన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు టీడీపీపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తనకు టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించిన టీడీపీ గుర్తు సైకిల్ పైనే పార్లమెంట్ కు వెళ్లారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కావడం, ఎంపీల ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఎంపీ అప్పల నాయుడు కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ప్రభుత్వం తనకు కేటాయించిన అతిథిగృహంలో ఫ్యామిలీతో కలిసి బస చేశారు.

సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం ఉండడంతో ఉదయమే ఆయన సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరి వెళ్లారు. తొలుత తన తల్లికి పాదాభివందనం చేసి, కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఎంపీ అప్పల నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లారు. సైకిల్ పై పార్లమెంట్ కు బయలుదేరిన ఎంపీ అప్పల నాయుడును ఇతర వాహనాల్లో వారంతా అనుసరించారు.
Kalisetti Appala naidu
Bicycle Ride
Parliament
TDP MP
Vijayanagaram
Viral Videos

More Telugu News