Sonakshi Sinha: నటి సోనాక్షి-జహీర్ ఇక్బాల్ వెడ్డింగ్ రిసెప్షన్.. కదిలి వచ్చిన బాలీవుడ్

Sonakshi and Zaheer wedding reception Salman Khan Kajol Rekha and others attend
  • ముంబైలోని సోనాక్షి ఇంట్లో నిరాడంబరంగా వివాహం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
  • సల్మాన్ నుంచి సీనియర్ రేఖ వరకు రిసెప్షన్‌కు క్యూ
ఏడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-జహీర్ ఇక్బాల్ నిన్న ఓ ఇంటివారయ్యారు. ఆదివారం సాయంత్రం ముంబైలోని సోనాక్షి ఇంట్లో నిరాడంబరంగా జరిగిన ఈ వివాహ వేడుకకు కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారి వివాహ ఫొటోలను సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అనంతరం జరిగిన రిసెప్షన్‌కు 1000మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వీరిలో సల్మాన్‌ఖాన్, కాజోల్, అదితీరావు హైదరి, సిద్ధార్థ్, సీనియర్ నటి రేఖ, ఆదిత్యరావ్ కపూర్, అనిల్ కపూర్, చుంకీపాడే, టబు, రిచా చద్దా, ఫర్దీన్‌ఖాన్, హుమాఖురేషీ, అర్బాజ్‌ఖాన్, రవీనాటాండన్, సంజీదా షేక్, గుల్షన్ దేవైష్, డైసీ షా, సంగీత బిజ్లానీ, షర్మీన్ సెగల్, సైరాబాను, సింగర్-రేపర్ హనీసింగ్ తదితరులు హాజరయ్యారు.
Sonakshi Sinha
Zaheer Iqbal
Bollywood
Salman Khan
Sonakshi Sinha Wedding

More Telugu News