Amaravati Farmers: మొక్కులు చెల్లించుకునేందుకు.. కాలినడకన ఇంద్రకీలాద్రికి అమరావతి రైతులు

Amaravati Farmers going to Vijayawada to visit Goddess Durgamma by walk
  • సుదీర్ఘంగా కొనసాగిన రాజధాని రైతుల ఉద్యమం
  • టీడీపీ కూటమి విజయంతో విజయం సాధించిన ఉద్యమం
  • తుళ్లూరు శిబిరం వద్ద పూజలు 
  • 11 గంటలకల్లా ఇంద్రకీలాద్రికి
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు తమ సుదీర్ఘ నిరసనను విరమించారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారంతో ఉద్యమం విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకునేందుకు అమరావతి ప్రాంత రైతులు కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు.

ఈ ఉదయం తుళ్లూరు శిబిరం వద్ద రైతులు, మహిళలు పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దుర్గమ్మ దర్శనం కోసం కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. 11 గంటలకల్లా కొండపైకి చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా యాత్ర సాగుతుంది.
Amaravati Farmers
Tulluru Farmers
Andhra Pradesh
Bezawada
Vijayawada
Goddess Durga

More Telugu News