Mudragada Kranthi: పేరు మారినా ఆలోచనా విధానం మారలేదు.. తండ్రి ముద్రగడపై కుమార్తె విమర్శ

Mudragada kranthi lashes out at father padmanabha reddy for criticizing pawan kalyan
  • జగన్‌ను ప్రశ్నించని తన తండ్రికి పవన్‌ను ప్రశ్నించే అర్హత ఉందా అని నిలదీత
  • సమాజానికి ఏం చేయాలో పవన్‌కు స్పష్టత ఉందని వ్యాఖ్య
  • శేష జీవితంలో ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకోవాలని తండ్రికి సలహా
  • మరోమారు పవన్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని వార్నింగ్
  • ఎక్స్ వేదికగా ముద్రగడ క్రాంతి కామెంట్స్
తన తండ్రి పేరు మార్పుపై ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె క్రాంతి తాజాగా స్పందించారు. ‘మా తండ్రి ముద్రగడ పద్మనాభం ఇటీవల తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. ఆయన ఆలోచనా విధానం మాత్రం మార్చుకోకపోవడం ఆందోళనగా ఉంది’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మాజీ మంత్రి ముద్రగడ ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్‌పై సవాలు విసిరి ఓటమి చెందిన నేపథ్యంలో తన పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా క్రాంతి స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిని ఎప్పుడూ ప్రశ్నించని తన తండ్రికి పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించే అర్హత ఉందా? అని నిలదీశారు. 

పేరు మార్చుకున్నాక కాపుల గురించి, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ గురించి ఆయనకు ఎందుకని ప్రశ్నించారు. సమాజానికి ఏం చేయాలో పవన్‌కల్యాణ్‌కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రమే లేదని అనిపిస్తోందని అన్నారు. శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దఫా పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటిస్తానని క్రాంతి స్పష్టం చేశారు.
Mudragada Kranthi
Mudragada Padmanabham
Pawan Kalyan
Janasena
YS Jagan

More Telugu News