Sukesh Chandrasekhar: రుషికొండ ప్యాలెస్ పై సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన సుఖేశ్ చంద్రశేఖర్

Sukesh Chandrasekhar wrote AP CM Chandrababu to purchase Rishikonda Palace
  • ఇటీవల విశాఖలోని రుషికొండ ప్యాలెస్ నిర్మాణాలను బహిర్గతం చేసిన టీడీపీ
  • ఆ భవనాన్ని తాను కొనుగోలు చేస్తానంటూ సుఖేశ్ లేఖ
  • కనీసం లీజుకైనా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి
తీహార్ జైల్లో ఉన్న ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ విశాఖలోని రుషికొండ ప్యాలెస్ అంశంపై స్పందించాడు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జైలు నుంచి లేఖ రాశాడు. 

ఆ భవనాన్ని తనకు విక్రయించాలని, లేకపోతే లీజుకైనా ఇవ్వాలని సుఖేశ్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాడు. మార్కెట్ ధర కంటే 20 శాతం అధికంగా చెల్లిస్తానని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు. తన లేఖను భవన కొనుగోలుకు అంగీకార పత్రంగా పరిగణించాలని తెలిపాడు. 

ఆర్థిక మోసాల ఆరోపణలపై తీహార్ జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ కు జైలు నుంచి లేఖలు రాయడం కొత్త కాదు. దేశంలో సంచలనం సృష్టించే అంశాలను లక్ష్యంగా చేసుకుని లేఖలు రాయడం అతడికి అలవాటే. ఇప్పుడు ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Sukesh Chandrasekhar
Rishikonda Palace
Chandrababu
AP CM
Andhra Pradesh

More Telugu News