Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో దక్షిణ కొరియా రాయబారి బృందం భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణ కొరియా రాయబారి బృందం భేటీ అయింది. శుక్రవారం మధ్యాహ్నం సీఎంతో సమావేశమైంది. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా రాయబారి బృందం కలిసింది.
సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. రైతు రుణమాఫీ అమలుపై విధివిధానాలను ఖరారు చేసే అవకాశముంది. రైతు భరోసా, పెన్షన్లు, రేషన్ కార్డులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, చెల్లిస్తున్న వడ్డీలు, ఆర్థిక క్రమశిక్షణ, అసెంబ్లీ సమావేశాలు తదితర అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది.