Naga Babu: పదేళ్ల కల నెరవేరింది.. ప్రజా ప్రస్థానం మొదలైంది: నాగ‌బాబు

Naga Babu Interesting Tweet on Pawan Kalyan goes Viral on Social Media
  • డిప్యూటీ సీఎం హోదాలో అసెంబ్లీలో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్
  • ఈ నేప‌థ్యంలో ఆయ‌న సోద‌రుడు నాగ‌బాబు స్పెష‌ల్‌ ట్వీట్‌
  • తమ్ముడు పవన్ ప్ర‌మాణం చూసి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని వ్యాఖ్య‌
  • 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది త‌న‌ పదేళ్ల కల అన్న నాగ‌బాబు
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ఈ రోజు శాసన సభ్యుడిగా ప్రమాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోద‌రుడు, జ‌న‌సేన నేత నాగ‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణస్వీకారం చేస్తున్నటువంటి తమ్ముడు పవన్ కల్యాణ్‌ని చూసి త‌న‌ మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. 

"తోడబుట్టిన వాడిగా & జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణస్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ క‌ల్యాణ్‌ అసెంబ్లీకి వెళ్లాలి. 'పవన్ కల్యాణ్ అను నేను' అని ప్రమాణస్వీకారం చేయాలనేది పదేళ్ల నా కల. అసెంబ్లీకి రావడం గ్యాలరీలో కూర్చోవడం నాకిదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్‌గా ఉంది.

మా కుటుంబం అంతా కూటమిలో కల్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయతీతో, నిష్పక్షపాతంగా అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నాను" అని నాగబాబు ట్వీట్ చేశారు.
Naga Babu
Pawan Kalyan
Janasena
Andhra Pradesh
Twitter

More Telugu News