AP Assembly Live: వైసీపీ అభ్యర్థనకు చంద్రబాబు ఓకే.. మంత్రుల తర్వాత జగన్ ప్రమాణం

YS Jagan To Swear As MLA After Ministers Swearing
  • మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
  • మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని వైసీపీ అభ్యర్థన
  • శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు
  • ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించిన ప్రభుత్వం
  • మంత్రుల తర్వాత జగన్ ప్రమాణానికి ఓకే
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నవేళ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు టీడీపీ ఓకే చెప్పింది. అసెంబ్లీ ప్రారంభం తర్వాత తొలుత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత చంద్రబాబు, మంత్రుల తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అలాగే ఉంటుందని ప్రకటించారు కూడా. అయితే, వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రభుత్వం మినహాయింపునిచ్చింది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదుర్కొన్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఆ పార్టీ పట్టుమని 11 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఈ నేపథ్యంలో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని, ఆయన కారును కూడా లోపలికి అనుమతించాలంటూ వైసీపీ నుంచి వచ్చిన అభ్యర్థనకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

ఈ విషయాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఈ రోజు వరకు జగన్ కారును లోపలికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత జగన్‌తో ప్రమాణ స్వీకారానికి ఓకే చెప్పారు.
AP Assembly Live
Chandrababu
YS Jagan
Andhra Pradesh

More Telugu News