Bandi Sanjay: ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటాను: బండి సంజయ్
- కరీంనగర్ యూనిట్ కార్యాలయంలో రామోజీరావుకు బండి సంజయ్ నివాళి
- రామోజీరావును కలిసినప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకునేవాడినని వ్యాఖ్య
- ఆయన భౌతికంగా లేకపోయినప్పటికీ ఈనాడు రూపంలో మనమధ్యే ఉంటారన్న కేంద్రమంత్రి
ఈనాడు గ్రూప్ సంస్థలకు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో రామోజీ గ్రూపు సంస్థల యజమాని దివంగత రామోజీరావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామోజీరావుతో తన సాన్నిహిత్యాన్ని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు.
ఆయనతో తనది గురుశిష్యుల బంధమన్నారు. రామోజీరావును కలిసినప్పుడల్లా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేవాడినని తెలిపారు. ఈనాడు ఉద్యోగులంటే సమాజంలో గౌరవం ఉంటుందని... అందుకు ఆయన అనుసరించే పద్ధతులే కారణమన్నారు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఈనాడు రూపంలో మనమధ్యే ఉంటారన్నారు.