CM Chandrababu: అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన

CM Chandrababu Tour In Amaravathi
  • సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శన‌
  • రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్న ముఖ్య‌మంత్రి
  • ఈ ప‌ర్య‌ట‌న‌లో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని తెలుసుకోనున్న చంద్ర‌బాబు    
అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్య‌మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్ర‌బాబు తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. 

అనంతరం ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్‌ యాక్సెస్‌ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాల్ని పరిశీంచారు. ఐకానిక్‌ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలు పెట్టిన ప్రాంతాలకు వెళ్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు.
CM Chandrababu
Amaravathi
Andhra Pradesh

More Telugu News