TTD: తిరుమలలో పలు చోట్ల కూలెంట్ పెయింట్లు వేయించిన టీటీడీ

TTD paints coolents at some needy points in Tirumala
  • టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు
  • నేడు ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశం
  • భక్తుల కాళ్లకు వేడి తగలకుండా చల్లదనం అందించే పెయింట్ల వినియోగం
టీటీడీ కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి జె.శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుమలలోని అవసరమైన ప్రదేశాల్లో కూలెంట్ పెయింట్లు వేయించారు. 

తిరుమలలోని కొన్ని ప్రదేశాల్లో పాదరక్షలు ధరించి నడవడం నిషిద్ధం. అలాంటి ప్రదేశాల్లో భక్తుల కాళ్లకు వేడిమి తగలకుండా ఈ కూలెంట్ పెయింట్లు చల్లదనాన్ని అందిస్తాయి. 

ఇవాళ ఈవో శ్యామలరావు గోకులం విశ్రాంతి గృహంలో ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎండ వేడిమి నుంచి ఇబ్బంది తొలగించేలా అవసరమైన ప్రాంతాల్లో కూలెంట్ పెయింట్లు వేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈవో ఆదేశాలతో తిరుమలలోని పలు ప్రదేశాలు కూలెంట్ పెయింట్లతో కొత్త రూపు సంతరించుకున్నాయి.
TTD
Syamala Rao
EO
Coolents
Paints
Summer
Tirumala

More Telugu News