Results: ఏపీలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల

Intermediate advanced supplimentary exams results released in AP
  • రాష్ట్రంలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
  • జనరల్ కేటగిరీలో 87 శాతం, ఒకేషనల్ కేటగిరీలో 84 శాతం ఉత్తీర్ణత 
  • జూన్ 26న ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదల
ఏపీలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియన్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మూల్యాంకనం పూర్తయిన నేపథ్యంలో, నేడు ఇంటర్  సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. 

విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో 87 శాతం, ఒకేషనల్ కేటగిరీలో 84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఇక, ఇంటర్ ఫస్టియర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను జూన్ 26న విడుదల చేయనున్నారు.
Results
Advanced Supplimentary
Intermediate
Andhra Pradesh

More Telugu News