Budda Venkanna: జగన్ కమాన్.. రాజీనామా చెయ్.. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలకు వెళ్దాం: బుద్దా వెంకన్న సవాల్

TDP leader Budda Venkanna demands YS Jagan to resign
  • ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ జగన్ ట్వీట్
  • పులివెందుల ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలని వెంకన్న డిమాండ్
  • బ్యాలెట్ పద్ధతిలోనే ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీని కోరుదామన్న నేత
  • ఈసారి గతంలో వచ్చినంత మెజార్టీ కూడా జగన్‌కు రాదని స్పష్టీకరణ
ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. జగన్‌కు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాలు విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక అంటూ జరిగితే ఇప్పుడు వచ్చినంత మెజార్టీ కూడా రాదని పేర్కొన్నారు. పులివెందుల ప్రజలే జగన్‌ను ఓడిస్తారని చెప్పారు. ఆయన ఇకనైనా చిలుక జోస్యాలు చెప్పడం మానుకోవాలని వెంకన్న హితవు పలికారు.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లలోనే విజయం సాధించింది. అప్పటి నుంచి వైసీపీ నేతలు ఈవీఎంలపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, తాజాగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఈవీఎంలను హ్యాక్ చేయచ్చంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో, జగన్‌ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇకపై ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జగన్ ట్వీట్‌తో టీడీపీ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల సమయంలో ఈవీఎంలకు వంతపాడుతూ మీడియాతో జగన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
Budda Venkanna
YS Jagan
Telugudesam
YSRCP
Pulivenduala
EVM

More Telugu News