పోలవరానికి చేరుకున్న సీఎం చంద్రబాబు
స్పీల్‌వే, కాపర్ డ్యామ్, డయాఫ్రం వాల్ పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి ఉండవల్లికి తిరిగి రానున్నారు.
సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారు ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు.